News May 24, 2024

కల్హేర్: సినీ ఫక్కీలో కిడ్నాప్..

image

సినీ ఫక్కీలో కళ్లల్లో కారం చల్లి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన సంఘటన గురువారం కల్హేర్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రిష్ణాపూర్‌‌కు చెందిన వెంకటేశం గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తితో కలసి కల్హేర్ తహసీల్ ఆఫీసుకు పనిమీద వచ్చారు. ఇంతలో ఒక మహిళ మరో ఇద్దరు వచ్చి నీతో మాట్లాడాలని వెంకటేశంకు తీసుకెళ్లారు. తర్వాత కళ్ల‌లో కారంపొడి చల్లి కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 28, 2026

MDK: శాంతి భద్రతల భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా మార్చి 1 నుంచి 31 వరకు పోలీసు యాక్ట్ 1861 సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిషేధమన్నారు. చట్టవ్యతిరేక చర్యలు, ఆస్తి నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News February 28, 2026

మెదక్: నాలుగో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

image

జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4,869 మందికి గాను 4,799 మంది, ఒకేషనల్ విభాగంలో 540 మందికి గాను 525 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా 98.42% హాజరు నమోదైందని వివరించారు.

News February 28, 2026

మెదక్‌లో సినిమా షూటింగ్ సందడి

image

చిన్నశంకరంపేట మం.జంగరాయి పరిసరాల్లో శివాని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘బుల్లెట్ బండి’ సాంగ్ షూటింగ్ సందడిగా జరిగింది. డైరెక్టర్ అరవింద్ దర్శకత్వంలో హీరో సంతోష్, నటులు అలీ గడ్డం, మహిపాల్, సుమిత్ర, అంజిరెడ్డి పాల్గొన్నారు. నిర్మాత శివాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చిత్రానికి మను కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రకృతి దృశ్యాల మధ్య జరుగుతున్న ఈ చిత్రీకరణను గ్రామస్థులు ఆసక్తిగా వీక్షించారు.