News July 8, 2025

కళాశాలల వద్ద ఆకస్మిక తనిఖీలు – గుట్కా స్వాధీనం

image

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కాలేజీలు, స్కూల్స్‌ చుట్టూ “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్” కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీపీ ఆదేశాల మేరకు పలు పాన్ షాపులు, బడ్డీ కొట్లు వద్ద ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమతులు లేని గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశారు. దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Similar News

News July 9, 2025

కోహ్లీకి థాంక్స్ చెప్పిన జకోవిచ్

image

టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ వింబుల్డన్ మ్యాచ్‌ను స్టార్ క్రికెటర్ కోహ్లీ, అనుష్క దంపతులు లైవ్‌లో వీక్షించారు. ‘వాట్ ఏ మ్యాచ్. గ్లాడియేటర్‌కు ఇది అలవాటైన పనే’ అని కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీనికి ‘థాంక్యూ ఫర్ సపోర్టింగ్’ అని జకోవిచ్ బదులిచ్చారు. తాము తరచూ ఫోన్లో మెసేజ్‌లు చేసుకుంటామని గతంలో వీరిద్దరూ చెప్పిన విషయం తెలిసిందే. అటు క్రికెట్ కంటే టెన్నిస్‌లోనే ఒత్తిడి ఎక్కువని కోహ్లీ అన్నారు.

News July 8, 2025

‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

image

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.

News July 8, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓భద్రాద్రి రామాలయ ఈవో పై దాడి
✓దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ప్రచారం
✓త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ
✓జిల్లా వ్యాప్తంగా సీత్లా పండుగ వేడుకలు
✓కూలిన భద్రాచలం కరకట్టను నిర్మించాలి: సీపీఎం
✓డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన అశ్వాపురం ఎస్ఐ
✓చండ్రుగొండ పంట పొలాల్లో సాంబార్ జింక మృతి
✓టేకులపల్లిలో మునగ తోటను పరిశీలించిన కలెక్టర్
✓ మాజీ సీఎం వైయస్సార్ జయంతి వేడుకలు