News June 19, 2024
కళ్యాణదుర్గం: రోడ్డుపైకి రెండు ఎలుగుబంట్లు

కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని కన్నేపల్లి రోడ్డుపైకి మంగళవారం సాయంత్రం రెండు ఎలుగుబంట్లు రావడం చూసి అటుగా వెళుతున్న ప్రయాణికులు భయాందోళన చెందారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని భయంతో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని కోరారు.
Similar News
News August 30, 2025
గణేష్ నిమజ్జనంపై జిల్లా ఎస్పీ సూచనలు

అవాంఛనీయ ఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ సూచించారు. శుక్రవారం రాచానపల్లి, పంపనూరు సమీప నిమజ్జనం ప్రాంతాలను పరిశీలించారు. బారికేడ్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వృద్ధులు, పిల్లలు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
News August 30, 2025
నాటసారా రహిత జిల్లాగా అనంతపురం: కలెక్టర్

అనంతపురాన్ని నాటసారా రహిత జిల్లాగా ప్రకటించామని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో నవోదయం 2.0 పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 104 గ్రామాలను నాటుసారా రహిత గ్రామాలుగా ప్రకటించామని చెప్పారు. అనంతరం పోస్టర్ విడుదల చేశారు.
News August 29, 2025
వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నల పంపిణీ

వచ్చే నెల నుంచి ప్రభుత్వ రేషన్ షాప్‌లలో లబ్ధిదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రమేశ్ రెడ్డి తెలిపారు. 6 నెలలకు సరిపడా సరుకును జిల్లాకు కేటాయించినట్లు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 6,600 మెట్రిక్ టన్నుల జొన్నలు, 2,700 మెట్రిక్ టన్నుల రాగులను కేటాయించినట్లు పేర్కొన్నారు.