News January 25, 2026

కళ్లు తాజాగా ఉండాలంటే..

image

ముఖంలో ఆకర్షణీయంగా ఉండేవి కళ్లే.. కానీ ప్రస్తుతం మారిన జీవన విధానంలో కళ్లు జీవం కోల్పోయినట్లు అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజులో కనీసం నాలుగైదు సార్లైనా కళ్లను చన్నీటితో కడగాలంటున్నారు నిపుణులు. కళ్లకు తరచూ విశ్రాంతినివ్వాలి. సరిపడా నిద్ర లేకపోయినా కంటి ఆరోగ్యం ప్రభావితమవుతుంది. నిద్రలేమి వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, గీతలు, ముడతలు ఏర్పడతాయి. నాణ్యమైన ఐ మేకప్ ఉత్పత్తులు వాడాలి.

Similar News

News February 23, 2026

ఏపీ పోలీసులపై పట్నా హైకోర్టు ఆగ్రహం

image

IPS సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్‌ విషయంలో AP పోలీసుల తీరుపై పట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అరెస్ట్ వారెంట్ లేదా కేస్ డైరీ వెంట లేకుండా సునీల్‌ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ట్రాన్సిట్ రిమాండ్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన అరెస్ట్ చెల్లదు. కాగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నిందితుడిగా ఉన్నారు.

News February 23, 2026

EPFO గుడ్‌న్యూస్.. వారి ఖాతాల్లో నగదు జమ

image

EPFOలో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా యాక్టివ్‌గా లేని ఖాతాల్లోని డబ్బును చందాదారులకు ఇవ్వనుంది. 31.86 లక్షల ఇనాక్టివ్ ఖాతాల్లో ₹10,903 కోట్లున్నాయి. తొలి దశలో ₹1000 లోపు బ్యాలెన్స్ ఉన్న 7L అకౌంట్లలో పైలట్ ప్రాజెక్టుగా ఆ మొత్తాన్ని జమ చేయనుంది. తర్వాత మిగతా ఖాతాల్లో రిఫండ్ చేయనుంది. మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని ఖాతాలను ఇనాక్టివ్‌గా పరిగణిస్తారు.

News February 23, 2026

ఇంటికి ఏ దిశలో ఏ మొక్కలు నాటాలి?

image

ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం శుభకరమని, గాలి శుద్ధై ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘వాస్తు ప్రకారం దక్షిణ, పడమర దిశల్లో ఎత్తైన చెట్లు, కూరగాయల మొక్కలు పెంచాలి. తూర్పు, ఉత్తర దిశల్లో చిన్న మొక్కలు ఉండాలి. ఈశాన్య మూలలో చెట్లు పెంచకూడదు. పాలు కారే, ముళ్ల చెట్లను ఉండకూడదు. ఈ నియమాలు పాటిస్తే అందం, ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>