News September 7, 2024

కవిటి ఉద్దాన ప్రాంతంలో మొక్క పెసలతో బొజ్జ గణపయ్య

image

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బోరువంక గ్రామంలో గల ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది (ముగ్ద గణపతి) పెసర విత్తనాలు వేసి నారుతో తయారుచేసిన విగ్రహాన్ని క్లబ్బుకు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగని గణపయ్యలను తయారు చేయడమే ఈయన ప్రత్యేకత.

Similar News

News September 16, 2024

నరసన్నపేట: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

image

నరసన్నపేట పట్టణంలోని కలివరపుపేట వీధికి చెందిన వైశ్యరాజు నాగరాజు(32) సోమవారం ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. కొన్నేళ్లుగా ఓ వ్యక్తి దగ్గర ఫైనాన్షియల్ కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడని ఆర్థిక ఇబ్బందులు కారణంగానే తాను మృతి చెందాడని తండ్రి లక్ష్మణ రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గ ప్రసాద్ తెలిపారు.

News September 16, 2024

నీట్ పీజీలో సిక్కోలు యువకుడి ప్రతిభ

image

నందిగం మండలం దిమిలాడ గ్రామానికి చెందిన నడుపూరు సాయికిరణ్ నీట్ మెడికల్ పీజీలో రాష్ట్ర స్థాయి 316వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విజయనగరం మిమ్స్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన యువకుడు పీజీ ప్రవేశం కోసం నీట్ పీజీ ప్రవేశ పరీక్షను రాశాడు. ఈ మేరకు డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు సోమవారం ఫలితాలు వెల్లడించారు. యువకుడి తండ్రి ఎన్.వి రమణమూర్తి మెరైన్ కానిస్టేబుల్, తల్లి నవనీత గృహిణి.

News September 16, 2024

శ్రీకాకుళం: కోర్టు మానిటరింగ్ సిస్టం సిబ్బందితో ఎస్పీ సమావేశం

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం కోర్టు మానిటరింగ్ సిస్టం సిబ్బందితో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కేసులు పరిష్కారం, శిక్షలు పడేందుకు కోర్టు కానిస్టేబుల్ విధులు చాలా కీలకం అని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా వివిధ కోర్టులో విచారణలో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.