News February 27, 2026

కవితకు న్యాయం జరిగింది: కేటీఆర్

image

TG: మద్యం కుంభకోణం కేసులో కవితకు న్యాయం జరిగిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘లిక్కర్ స్కామ్ సాకుతో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం BRS. ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే తేలిపోతుంది. కుట్రపూరిత కేసులను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News February 28, 2026

పార్టీ ఏర్పాటుకు ముందు క్లీన్‌చిట్.. ఇక దూకుడేనా?

image

TG: లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో జాగృతి చీఫ్ కవిత దూకుడు పెంచే అవకాశం ఉంది. పార్టీ ఏర్పాటుకు ముందు నిర్దోషిగా తేలడం ఆమెకు సానుకూల అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు BRS నుంచి మద్దతు లభించలేదని కవిత పలుమార్లు వాపోయారు. పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత ‘లిక్కర్ క్వీన్’ అంటూ పలువురు BRS శ్రేణులు ఆమెను విమర్శించాయి. మరి ఇప్పుడు వారు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.

News February 28, 2026

ఇన్‌స్టా పోస్ట్.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

image

ఇన్‌స్టాలో హీరోయిన్ రష్మిక రికార్డ్ సృష్టించారు. తన పెళ్లి ఫొటోలు పోస్టు చేయగా దానికి 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇది ఇండియాలో అత్యధిక లైక్స్ సాధించిన ఇన్‌స్టా పోస్ట్‌గా రికార్డులకెక్కింది. ఇప్పటివరకూ ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చేసిన పోస్ట్‌కు 22.9M లైక్స్ వచ్చాయి. వీటి తర్వాత IPL గెలిచాక కోహ్లీ పోస్ట్‌కు 19.8M, రిటైర్మెంట్ పోస్ట్‌(19.7M) ఉన్నాయి.

News February 28, 2026

AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>బీబీనగర్‌లోని<<>> AIIMSలో 3 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, BSc(నర్సింగ్), GNM, BSc(రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్/EMT) అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు నెలకు రూ.30K, నర్సింగ్ ఆఫీసర్‌, టెక్నీషియన్‌కు రూ.40K చెల్లిస్తారు. వెబ్‌సైట్: aiimsbibinagar.edu.in