News October 26, 2025
కవిత ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతలు స్పందిస్తారా?

నిజామాబాద్‌లో జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన ఓటమికే <<18110074>>BRS ఎమ్మెల్యేలే<<>> కారణమని ఆరోపించారు. అంతేగాక తన ఓటమికి కొందరు <<18102361>>కుట్ర పన్నరాని<<>> పేర్కొన్నారు. ఇంతకి ఎవరా ఎమ్మెల్యేలు అనే చర్చ జిల్లాలో మెుదలైంది. పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయకున్నా BRS నుంచి తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కవిత వ్యాఖ్యలపై BRS నేతలు స్పందిస్తారా? మౌనాన్ని పాటిస్తారా వేచి చూడాలి.
Similar News
News October 26, 2025
ఏపీలో నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా

AP: రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా పడింది. ఎల్లుండి అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకులకు శంకుస్థాపన చేసేందుకు ఆమె రేపు రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ మొంథా తుఫాన్ కారణంగా మంత్రి పర్యటన వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
News October 26, 2025
సిరిసిల్ల: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికో.. ?

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మద్యం పాలసీ 2025-27కు ఎక్సైజ్ అధికారులు రేపు డ్రా తీయనున్నారు. జిల్లాలోని మొత్తం 48 దుకాణాలకు 1,381 దరఖాస్తులు వచ్చాయని, దీంతో రూ.41.43 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. జిల్లెల వైన్స్‌కు అత్యధికంగా 53 దరఖాస్తులు రాగా, రుద్రంగి వైన్స్‌కు అత్యల్పంగా 15 దరఖాస్తులు వచ్చాయి. రేపటి లక్కీ డ్రాలో టెండర్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.
News October 26, 2025
నెల్లూరు: గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి సర్వే

నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా ఆదేశాలతో మనుబోలు మండలం- పల్లిపాలెం గ్రామంలో గిరిజనుల ఇళ్ల నిర్మాణం కోసం ఆదివారం హౌసింగ్ అధికారులు సర్వే నిర్వహించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు తమకు ఇల్లు లేవని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్వేచేసి అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని హౌసింగ్ ఏఈ శరత్‌బాబు తెలిపారు.


