News January 19, 2026
కవిత కొత్త పార్టీకి సన్నాహాలు.. స్ట్రాటజిస్ట్‌గా పీకే

TG: జాగృతి చీఫ్ కవిత ఉగాది వేళ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆమె పార్టీ కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగారు. ఇటీవల 5 రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేసి కొత్త పార్టీపై కవితతో చర్చలు జరిపారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అంతేకాదు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లోని ఇద్దరు కీలక నేతలతో కూడా పీకే మాట్లాడినట్లు తెలుస్తోంది.
Similar News
News February 13, 2026
కానిస్టేబుల్ సస్పెండ్.. గెలిచిన భార్య!

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో సస్పెండైన కానిస్టేబుల్ భార్య గెలిచారు. సిద్దిపేట(D) చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో BRS తరఫున గీతాంజలి పోటీ చేశారు. ఆమె భర్త రమేశ్ కొమురవెళ్లి PSలో కానిస్టేబుల్. ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు వెళ్లడంతో విధుల నుంచి రమేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.
News February 13, 2026
T20WC: USA భారీ స్కోర్

చెన్నై వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో USA చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. ముక్కమల్ల సాయితేజ 79 పరుగులతో సత్తా చాటారు. మరోవైపు శుభమ్ 24 బంతుల్లోనే 48 రన్స్ చేశారు. 3 ఫోర్లు, 2 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 3 వికెట్లు తీశారు.
News February 13, 2026
ఒక్క చోటా గెలవని తీన్మార్ మల్లన్న పార్టీ

TG: మున్సిపల్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ ఒక్కచోటా గెలవలేకపోయింది. కత్తెర గుర్తుపై TRP అభ్యర్థులు పోటీ చేశారు. తమకు BC వర్గాల మద్దతు ఉంటుందని, కనీసం 40 స్థానాలు గెలుస్తామని మల్లన్న సహా నేతలు ప్రకటించారు. కానీ ఎక్కడా ఆ పార్టీ ప్రభావం కనిపించలేదు. సూర్యాపేటలోని 2 వార్డుల్లో మాత్రమే కొంతమేర ఓట్లు వచ్చాయి. ఇవి మినహా ఇంకెక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు.


