News February 5, 2026
కవిత వ్యవహారంతో బీఆర్ఎస్ బండారం బయటపడింది: కిషన్ రెడ్డి

దోచుకున్న డబ్బు పంచుకునే విషయంలోనే కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, కవిత వ్యవహారమే ఇందుకు నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక మున్సిపల్ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో “సారు-కారు” అంటూ రాష్ట్రాన్ని ఖాళీ చేశారని ఎద్దేవా చేశారు. అధికారం పోయాక వాటాల గొడవలతో ఆ కుటుంబం రోడ్డున పడిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పాలని కోరారు.
Similar News
News February 16, 2026
TGలో మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ల ఎన్నిక UPDATES

* నిర్మల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య(INC), వైస్ ఛైర్మన్‌గా అప్పాల గణేశ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ భార్యాభర్తలు.
* జగిత్యాల(D) మెట్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా లింబాద్రి(INC) ఎన్నికయ్యారు. 26 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 6 సీట్లే గెలుచుకుంది. అయితే పలువురు ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ సభ్యుడి మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.
News February 16, 2026
హోలీ పండుగ స్పెషల్.. విశాఖ నుంచి ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ విడుదల

హోలీ పండుగ రద్దీ దృష్ట్యా భారత రైల్వే మార్చి నెలలో విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లికి మార్చి 6 నుంచి 27 వరకు (శుక్రవారాలు), బెంగళూరుకు మార్చి 1 నుంచి 29 వరకు (ఆదివారాలు), తిరుపతికి మార్చి 2 నుంచి 30 వరకు (సోమవారాలు) ఈ రైళ్లు నడుస్తాయి. అలాగే షాలిమార్, సంబల్పూర్, భువనేశ్వర్ మార్గాల్లోనూ మార్చి నెల అంతా వారపు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
News February 16, 2026
MBNR: మధ్య తరగతి కుటుంబం నుంచి మేయర్ దాకా!

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ అప్పన్నపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గుమాల్ మమత శీను ముదిరాజ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ తొలి మహిళ మేయర్‌గా మమత ఎన్నిక కావడం విశేషం. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి మేయర్‌గా ఎన్నిక కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


