News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్సిగ్నల్
కవ్వాల అభయారణ్యం పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల రాకపోకలను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు. రాకపోకలకు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాత్రి వేళల్లో రాకపోకలను అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వేటర్ను ఆదేశించారు. దీనిపై మంగళవారం HYDలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంత్రిని కలిశారు.
Similar News
News February 5, 2025
నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు
నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.
News February 5, 2025
ADB: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు
అన్ని గురుకులాలలో 5-9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈనెల 6 వరకు ప్రభుత్వం పొడిగించిందని ఆదిలాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ లలిత కుమారి తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్లో నమోదుచేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్షలో కనబర్చిన ప్రతిభ విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలల ప్రాధాన్యత ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
News February 4, 2025
ఆదిలాబాద్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
◾నార్నూర్ మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన.
◾గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి
◾ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కి షాక్.. బరిలో మరో అభ్యర్థి
◾విషాదం.. విదేశంలో ఆదిలాబాద్ వాసి మృతి
◾అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
◾ప్రధానమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
◾మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు
◾ప్రభుత్వంపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఫైర్