News February 5, 2025

కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల, నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

image

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 16, 2025

మియాపూర్: డ్యూటీలో గుండెపోటుతో కండక్టర్ మృతి

image

మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కండక్టర్ పండరి గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. సహోద్యోగులతో సరదాగా మాట్లాడుతూ పండరి వాష్‌రూమ్‌కి వెళ్లొస్తానని వెళ్లాడు. వెంటనే అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో సహోద్యోగులు అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు.

News September 16, 2025

ఆళ్లగడ్డలో మృతదేహం లభ్యం

image

ఆళ్లగడ్డలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. అభిరుచి హోటల్ వెనుక ఉన్న గని గుంతలో నీటిపై తేలియాడుతూ కనిపించింది. మృతుడి వయస్సు 30-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నలుపు, ఎరుపు గీతలు ఉన్న ఫుల్ హ్యాండ్ చొక్కా, ఆకుపచ్చ లోయర్ ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసినవారు 9121101164 (సీఐ), 9121101203 (ఎస్సై) నంబర్లకు ఫోన్ చేసి తెలపాలని కోరారు.