News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్
కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
T20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ సంచలనం
T20 క్రికెట్(ఇంటర్నేషనల్+లీగ్స్)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ ఖాన్(AFG) చరిత్ర సృష్టించారు. 460 మ్యాచ్‌లలో 632 వికెట్లు పడగొట్టి బ్రావో(631 వికెట్లు)ను వెనక్కినెట్టారు. SA20లో MI కేప్‌టౌన్ తరఫున ఆడుతున్న అతను పార్ల్ రాయల్స్‌పై 2 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించారు. 26 ఏళ్లకే ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. త్వరలోనే వెయ్యి వికెట్లకు చేరుకోవడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News February 5, 2025
చికిత్స పొందుతూ యువకుడి మృతి
పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన పరమేశ్ నాయుడు(22) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ముచ్చుమర్రి ఏఎస్ఐ శేషయ్య వెల్లడించారు. ఐటీఐ చదివి వ్యవసాయం చేసుకుంటున్న పరమేశ్.. గత నెల 27న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
News February 5, 2025
విశాఖ: ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఆనందపురం ఎంఈవోగా పదవీ విరమణ చేసిన ఎస్.ఎస్.పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ యూనియన్‌లతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.