News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలకు అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.
Similar News
News July 7, 2025
విజయనగరం జిల్లాలో కూలిన వంతెన

సంతకవిటి మండలం కొండగూడెం-ఖండ్యాం మధ్య సాయన్నగెడ్డపై ఉన్న వంతెనపై ఆదివారం రాత్రి కుప్పకూలింది. దీనితో సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, బూర్జ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఖండ్యాంలో ఇసుక రీచ్‌కు వస్తున్న భారీ లారీల కారణంగా వంతెన కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే వంతెనకు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
News July 7, 2025
సంగారెడ్డి: కొత్త ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు ప్రభుత్వ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వైద్య విధాన పరిషత్ డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. జిల్లాలలోని తెల్లాపూర్, కంగ్టి, గుమ్మడిదల-నర్సాపూర్ జాతీయ రహదారి మధ్య ట్రామా కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
News July 7, 2025
‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.