News November 8, 2025
కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో జియోకు 2 ఎకరాలు

TG: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో రిలయన్స్ కంపెనీ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దాదాపు 2 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో ఈ భూమిని ఇచ్చారు. ఆ సంస్థ ఈ భూమిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయనుంది. ప్రభుత్వం కొన్ని షరతులతో జీఓ విడుదల చేసింది. కేంద్ర అటవీ నిబంధనలకు లోబడి ఈ భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
Similar News
News November 8, 2025
త్వరలోనే మహిళలకు రూ.2,500: జగ్గారెడ్డి

TG: వృద్ధులకు రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 సాయం అందించే పథకాలు త్వరలోనే అమలు అవుతాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు. ఈ స్కీముల అమలుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారని, నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మీడియా సమావేశంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.
News November 8, 2025
హెల్మెట్ లేదని రూ.21లక్షల ఫైన్.. చివరికి

హెల్మెట్ లేదని ఓ వ్యక్తికి పోలీసులు ఏకంగా రూ.20,74,000 లక్షల చలాన్ వేశారు. UPలోని ముజఫర్‌నగర్‌కు చెందిన అన్మోల్ స్కూటర్‌పై వెళ్తుండగా హెల్మెట్ లేదని పోలీసులు ఆపారు. బండిని సీజ్ చేసి చలాన్ రశీదు ఇచ్చారు. అమౌంట్ చూసి అన్మోల్ షాక్ అయ్యాడు. దాన్ని ఫొటో తీసి SMలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీనిపై అన్మోల్ ప్రశ్నించగా పోలీసులు దాన్ని రూ.4000గా మార్చారు. టెక్నికల్ సమస్య వల్ల ఎక్కువ వచ్చిందన్నారు.
News November 8, 2025
న్యాయవాదుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నాం: ఫరూక్

AP: వైసీపీ తన పాలనలో న్యాయవాదుల సంక్షేమాన్ని విస్మరించిందని మంత్రి ఫరూక్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటోందని వివరించారు. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ నుంచి మరణించిన 1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రూ.46కోట్లు రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. న్యాయవాది కుటుంబానికి సంక్షేమ నిధి ఇచ్చే మొత్తానికి అదనంగా రూ.4లక్షలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.


