News April 6, 2025
కశింకోట: ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

కశింకోట మండలం నర్సింగబిల్లిలో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పి.బ్యూల (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు శనివారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 7, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి!

ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి శ్రీరామనవమి రోజున ఒక్కటయ్యారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కుటుంబ సభ్యులు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
News April 7, 2025
మేడ్చల్ జిల్లాలో విపరీతంగా ఉక్కపోత..!

మేడ్చల్ జిల్లాలో ఉక్కపోత రోజురోజుకు అధికమవుతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఉప్పల్, ఈసీఐఎల్, మేడ్చల్, మల్లాపూర్ ప్రాంతాల్లో తీవ్ర ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా తగినన్ని నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు పట్ల మరింత జాగ్రత్త పడాలన్నారు.
News April 7, 2025
నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

AP: బకాయిలు చెల్లిస్తేనే NTR వైద్య సేవ పథకం సేవలను కొనసాగిస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రూ.3,500 కోట్లు బకాయిలు ఉండటంతో ఆర్థిక భారం పెరిగిందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన బకాయిల కంటే నెట్‌వర్క్ ఆసుపత్రులు అందించిన వైద్య సేవల విలువ ఎక్కువని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి సేవలను కొనసాగించలేమని తాజా లేఖలో పేర్కొంది.