News December 20, 2025

కశింకోట: విజయవంతంగా ముగిసిన సీఎం పర్యటన

image

సీఎం చంద్రబాబు పర్యటన అత్యంత కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య విజయవంతంగా ముగిసిందని డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. సమన్వయంతో పనిచేసిన సిబ్బందిని అభినందించారు. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు. సీఎం బందోబస్తుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News December 25, 2025

సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా షంషుద్దీన్

image

ముస్లిం సమైక్య వేదిక సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా గోరంట్లలోని మల్లాపల్లి గ్రామానికి చెందిన షంషుద్దీన్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించిన ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ అన్వర్, అలాగే మహిళా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మక్బూల్తాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు.

News December 25, 2025

అనంత జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి ఈయనే.!

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బొమ్మనహల్ దర్గా హోన్నూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు హెచ్.ఆనంద్‌ను జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించారు. తాను పార్టీకి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలిపారు. ఈ పదవిని ఇచ్చిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 25, 2025

1.07 లక్షల మందికి స్కాలర్‌షిప్

image

AP: రాష్ట్రంలోని కేజీబీవీల్లో చదువుకుంటున్న బాలికల స్కాలర్‌షిప్‌ల కోసం సమగ్రశిక్ష రూ.10.70 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను రూ.1,000 చొప్పున విద్యార్థినుల పేరెంట్స్ ఖాతాల్లో జమ చేసింది. కేజీబీవీల్లో 1.07 లక్షల మంది బాలికలు చదువుకుంటున్నారు. నిధుల విడుదలతో వారందరికీ ఊరట కలగనుంది.