News December 29, 2025
కశ్మీర్‌లో బౌద్ధం: ఫ్రాన్స్ మ్యూజియం ఫొటోల్లో 2000 ఏళ్ల చరిత్ర

ఫ్రాన్స్ మ్యూజియంలోని కొన్ని పాత ఫొటోలు కశ్మీర్ 2000 ఏళ్ల నాటి బౌద్ధ చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. జెహన్‌పొరాలో జరిగిన తవ్వకాల్లో పురాతన బౌద్ధ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ సంస్కృతికి కేంద్రంగా ఉండేదని ప్రధాని మోదీ తాజా ‘మన్ కీ బాత్’లో చెప్పారు. ఒకప్పుడు సిల్క్ రూట్ ద్వారా కంధార్ వరకు విస్తరించిన బౌద్ధ నెట్‌వర్క్‌లో కశ్మీర్ కీలక పాత్ర పోషించిందని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి.
Similar News
News December 30, 2025
వైకుంఠ ఏకాదశి: పురాణ గాథ ఇదే..

పూర్వం మధుకైటభులు అనే రాక్షసులను విష్ణువు సంహరించినప్పుడు వారు వైకుంఠ ద్వారం వద్ద స్వామిని దర్శించుకుని శాపవిమోచనం పొందారు. ఈ పవిత్ర దినాన తమలాగే ఎవరైతే ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటారో, వారికి మోక్షం ప్రసాదించాలని వారు కోరుకున్నారు. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి అంత ప్రాధాన్యత. తనను కొలిచే భక్తులను అనుగ్రహించడానికి శ్రీహరి ముక్కోటి దేవతలతో కలిసి భువికి చేరుకుంటారట.
News December 30, 2025
ధనుర్మాసం: పదిహేనో రోజు కీర్తన

నిద్రిస్తున్న ఓ గోపికను మేల్కొల్పే క్రమంలో ఆమెకు, గోపికలకు మధ్య జరిగిన సంభాషణ ఇది. బయట వారు ‘లేత చిలుకా! ఇంకా నిద్రనా?’ అని ఆటపట్టిస్తే, ఆమె లోపలి నుంచే ‘నేను వస్తున్నా, అంత గొంతు చించుకోకండి’ అని బదులిస్తుంది. ‘నీ మాటకారితనం మాకు తెలుసు’ అని వారు గేలి చేస్తే, ఆమె వినమ్రంగా జవాబిస్తుంది. చివరకు కంసుడిని, కువలయాపీడమనే ఏనుగును సంహరించిన కృష్ణుడి గుణగానం చేయడానికి అందరూ కలిసి వెళ్తారు. <<-se>>#DHANURMASAM<<>>
News December 30, 2025
హమాస్‌కు నరకమే.. ట్రంప్ హెచ్చరికలు

ఆయుధాలను వదిలేసేందుకు హమాస్ ఒప్పుకోకపోతే నరకం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ సంస్థకు కొద్ది సమయం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతికి నిరాయుధీకరణ చాలా ముఖ్యమని చెప్పారు. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాము దాడులకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.


