News October 15, 2025
కష్టపడిన వారికే పదవులు దక్కుతాయి: ఎంపీ RRR

కాంగ్రెస్ పార్టీ విస్తరణకు కృషి చేసిన, కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అభయమిచ్చారు. బుధవారం కొత్తగూడెంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు పని చేసిన వారిని మర్చిపోమని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కలిసికట్టుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషికి గుర్తింపు ఉంటుందని చెప్పారు.
Similar News
News October 16, 2025
కనికరం లేని దైవమే ‘భూతం’

<<17901211>>భూతం<<>> అంటే చెడు శక్తులు కాదన్న విషయం మనం తెలుసుకున్నాం. కానీ దైవానికి, భూతానికి మధ్య తేడా ఉంటుంది. దేవతలు దేశాన్ని రక్షిస్తూ, దయ, కనికరం చూపిస్తారు. వీరి వద్ద తప్పుకు విముక్తి ఉంటుంది. కానీ భూతాలు గ్రామాన్ని మాత్రమే చూసుకునే స్థానిక దైవాలు. వీటికి కనికరం ఉండదు. ఓ వ్యక్తి తప్పు చేస్తే వెంటనే శిక్షను విధిస్తాయి. అందుకే ఈ ఉగ్ర శక్తిని గ్రామస్థులు ఎక్కువగా నమ్ముతారు. భయపడతారు. <<-se>>#Kanthara<<>>
News October 16, 2025
కావలి : పట్టపగలే ఇంట్లో దొంగతనం

కావలిలోని వడ్డెపాలెం రైల్వే క్వార్టర్స్ నందు రైల్వే ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న శైలజ ఇంట్లో మధ్యాహ్నం దొంగతనం జరిగింది. వారి బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లి ఇంటికి రాగ ఇంటి వెనుక నుంచి తలుపులు బద్దలు కొట్టి ఇంటిని దోచుకున్నారు. రూ.30 వేల నగదు, 3 బంగారు ఉంగరాలు, వెండి మొలతాడు కనిపించట్లేదన్నారు. స్థానిక ఒకటవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 16, 2025
రంజీ ట్రోఫీ.. 40 ఏళ్ల వయసులో రికార్డు

రంజీ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా J&K కెప్టెన్ పరాస్ డోగ్రా(40 ఏళ్లు) నిలిచారు. ముంబైతో మ్యాచులో ఆయన 32వ సెంచరీ నమోదు చేశారు. 42 సెంచరీలతో మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే రంజీల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో జాఫర్ (12,038) తర్వాత డోగ్రా(9,500) రెండో స్థానంలో ఉన్నారు. 2001-02లో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన డోగ్రా గతంలో HP, పుదుచ్చేరి జట్లకు ఆడారు.