News March 8, 2025
కష్టాలను ఎదిరించి నిలబడ్డ చిత్తూరు బిడ్డ.. అముద

ఊహతెలిసే సమయానికే తండ్రి మరణం. కోలుకునేలోపు తల్లి దూరం. అల్లారు ముద్దుగా పెరగాల్సిన సమయంలో కుటుంబ బాధ్యతలు. అయినా ఆమె ఏమాత్రం చెక్కు చెదరలేదు. కష్టపడి ముగ్గురు తోబుట్టువులను పోషించింది. వారి కోసం పెళ్లికి సైతం దూరం అయ్యారు. నిప్పులో కాలిస్తే ఇనుము పదునెక్కినట్లు కష్టాలను సైతం విజయానికి సోపానాలగా మార్చుకుని.. చిత్తూరు నగరాకి మొదటి మహిళగా ప్రశంసలు అందుకుంటున్న మేయర్ అముద విజయగాథ ఇది. #HappyWomensDay
Similar News
News March 10, 2025
అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి: ఎమ్మెల్యే భానుప్రకాశ్

రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని నగరి ఎమ్మెల్యే భానుప్రకాశ్ అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్ధ ‘రాస్’ ఆధ్వర్యంలో పుత్తూరులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళల అభివృద్ధి కోసం ‘రాస్’ సంస్ధ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శనీయమన్నారు. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే సాంఘిక, ఆర్థిక, అధికారాల పంపిణీ జరగాలన్నారు.
News March 9, 2025
కుప్పంలో గిట్టుబాటు ధరలు లేని బంతిపూలు

రైతులకు గిట్టుబాటు ధర లేక బంతిపూలను కుప్పం పురపాలక సంఘం పూలు మార్కెట్ నుంచి రైతులు టాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. బంతి పూలను జంతువులకు ఆహారంగా పెడుతున్నారు. మార్కెట్‌లో బంతిపూలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వెంటనే పూల రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
News March 8, 2025
చిత్తూరు: వైసీపీ మహిళా విభాగంలో జిల్లా వాసుల నియామకం

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర మహిళా అనుబంధ విభాగంలో చోటు లభించింది. రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా గీతా యాదవ్, జనరల్ సెక్రటరీలుగా గాయత్రీ దేవి, దాక్షాయిణి, స్పోక్స్ పర్సన్‌గా శ్రీదేవి రెడ్డి, కార్యదర్శులుగా మేరీ జయరాం, సరస్వతమ్మ, కల్పలత రెడ్డి, యమునమ్మ, ధనలక్ష్మిని నియమిస్తూ పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.