News December 13, 2025
కస్టమ్స్ కమిషనర్ ఆఫీస్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

కోచిలోని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ట్రేడ్స్‌మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: taxinformation.cbic.gov.in/
Similar News
News March 6, 2026
ఎల్లుండి ఫైనల్.. టెన్షన్ అంతా అహ్మదాబాద్ స్టేడియం గురించే!

T20WC ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియా అభిమానులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. తుదిపోరు జరిగే అహ్మదాబాద్ స్టేడియంలో ఐసీసీ టోర్నమెంట్లలో INDకు రికార్డు బాగాలేదు. 2023 వన్డే WCలో ఓటమి ఎరుగని భారత్ అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో కంగుతిని కప్పు కోల్పోయింది. తాజా WCలో సౌతాఫ్రికాపై 76 రన్స్ తేడాతో ఓడిపోయింది. 2023 నుంచి భారత్ ICC టోర్నమెంట్లలో రెండే మ్యాచులు ఓడిపోగా ఆ రెండూ అహ్మదాబాద్‌లోనే జరగడం గమనార్హం.
News March 6, 2026
చర్చల్లేవ్.. లొంగిపోవాల్సిందే: ట్రంప్

ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. లొంగిపోవడం ఒక్కటే ఇరాన్ ముందున్న మార్గమని ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత గొప్ప, అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడి ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. ఇరాన్‌కు గొప్ప భవిష్యత్ ఉందని తెలిపారు. MAKE IRAN GREAT AGAIN (MIGA) అని పిలుపునిచ్చారు.
News March 6, 2026
లిక్కర్ స్కామ్.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, చాణక్యకు చెందిన రూ.441 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసి పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారని పేర్కొంది. ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో తేలిందని వెల్లడించింది. కమీషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేశారని వివరించింది.


