News January 6, 2025
కాంగ్రెస్‌కు ఆదిలాబాద్ సెంటిమెంట్
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమీక్ష సోమవారం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తున్న కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా టీపీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్ధేశం చేయనున్నారు.
Similar News
News January 8, 2025
జర్నలిస్టులపై మంచిర్యాల MLA వివాదాస్పద వ్యాఖ్యలు
మంచిర్యాల ఎమ్మెల్యే జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని TUWJ(IJU) నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష్య,కార్యదర్శులు సత్యనారాయణ, సంపత్‌రెడ్డి ప్రకటనలో విడుదల చేశారు. తాను తలుచుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో సగం పత్రికలు,TVచానళ్లను మూసి వేయిస్తానని హెచ్చరించే ధోరణిలో వ్యాఖ్యానించడాన్ని సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే వ్యాఖ్యలను వాపస్ తీసుకున్నట్లు ప్రకటించాలన్నారు.
News January 8, 2025
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: నిర్మల్ SP
నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ప్రకటనలో తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా వాడితే ప్రజలు, జంతువులకు ప్రాణాపాయం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చైనా మాంజా కట్టడికి పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
News January 7, 2025
ADB డీఈఓను పరామర్శించిన కలెక్టర్
ఆదిలాబాద్ విద్యాశాఖాధికారి ప్రణీతకు గుండెపోటు వచ్చిన నేపథ్యంలో ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షిషా మంగళవారం ఆమెను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి డీఈఓ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, తదితరులున్నారు.