News March 20, 2025
కాంగ్రెస్‌తోనే సాధ్యమైన ఎస్సీ వర్గీకరణ: మంత్రి

మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంత్రిని ఆందోలు నియోజకవర్గ దళిత కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో గురువారం కలిసి సన్మానించారు. కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాణిక్యం, నాయకులు గణపతి, సుధాకర్, నగేష్, కృష్ణ, లక్ష్మణ్, పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
భారీగా తగ్గిన సిల్వర్ రేటు

బంగారం ధరలు కాస్త తగ్గి సామాన్యుడికి ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.90,200కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.
News March 21, 2025
GREAT:TG ఖోఖో జట్టుకు ఎంపికైన అక్కచెల్లెలు

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ క్రీడలకు ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన గోపాలం, వెంకటమ్మ దంపతుల నలుగురు కూతుర్లు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టుకు అక్క చెల్లెలు బీ.రూప(PD), బీ.దీప(SGT), బీ.శిల్ప(వెటర్నరీ అసిస్టెంట్), బీ.పుష్ప(PET) ఎంపికయ్యారు. నేటి నుంచి ఈనెల 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో వీళ్ళు పాల్గొంటారు. CONGRATULATIONS
News March 21, 2025
HYDలో అడవిని సృష్టించలేం.. కానీ..!

మన HYDలో అడవిని సృష్టించలేము. కానీ, ప్రయత్నం చేద్దాం. ‘రాజధాని’ కాంక్రిట్ జంగిల్‌గా మారడంతో గల్లీ గల్లీకి సీసీ రోడ్డు వస్తున్నాయే తప్పా.. ఓ మొక్క నాటడానికి జాగ దొరుక్తలేదు. హరితహారం, వన మహోత్సవం అంటూ ప్రభుత్వాలు గొప్ప పనే చేస్తున్నాయి. కానీ, సామాజిక బాధ్యతగా చెట్లను రక్షించాల్సిన మనం ఏం చేస్తున్నాం? అసలే ఎండకాలం. నీడనిచ్చే చెట్లను కాపాడుకుందాం.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
SAVE TREES.