News February 16, 2026

కాంగ్రెస్‌దే తొర్రూరు?

image

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మునిసిపాలిటీ కాంగ్రెస్ వశమైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు చెందిన ఓ అభ్యర్థి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంతో తొర్రూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు సాధించినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొర్రూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.

Similar News

News February 17, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤ఎల్.ఎన్ పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోట్లు వచ్చిన ఆనందం
➤మందస: పొక్సో కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
➤ప్రజాదర్బార్ నిర్వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే బగ్గు
➤టెక్కలికి ఆయుష్ ఆసుపత్రి మంజూరు: అచ్చెన్న
➤శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 39, కలెక్టర్ గ్రీవెన్స్‌కు 94 వినతులు
➤పలాసలో అక్రమ గ్రావెల్ తరలింపు

News February 17, 2026

NRPT: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

image

ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు జరిగే ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి తప్పులకు తావులేకుండా పరీక్షల నిర్వహించాలని చెప్పారు. 4408 మంది ఇంటర్ మొదటి సంవత్సరం, 3783 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నట్లు అధికారులు వివరించారు.

News February 17, 2026

ఘనంగా యాదాద్రి శ్రీరామలింగేశ్వర స్వామికి రథోత్సవం

image

యాదగిరిగుట్ట కొండపై ఉన్న శ్రీ పర్వతవర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి‌. ఇందులో భాగంగా సోమవారం రాత్రి దివ్య విమాన రథోత్సవం ఘనంగా నిర్వహించారు. శివపార్వతులను రథంలో ఉంచి, పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.