News February 2, 2025
కాంగ్రెస్‌లోని రెడ్లకే టికెట్లు ఇస్తే బీసీ కులగణన ఎందుకు?: జాజుల
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.
Similar News
News February 2, 2025
HYD: సీఎం సంకుచిత మనస్తత్వాన్ని నిరసించాల్సిందే: BRS
14 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్, పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన సేవలు, ఆయన వయస్సు, శారీరక స్థితిపై సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ సమాజాన్ని నివ్వెర పరిచాయని బీఆర్ఎస్ Xలో ట్వీట్ చేసింది. కేసీఆర్ ప్రమాదంలో గాయపడితే దాన్ని కూడా రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవాలన్న రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వాన్ని కచ్చితంగా నిరసించాల్సిందేనని మండిపడింది.
News February 2, 2025
HYD: అప్డేట్ అయిన సిటీ డే పాస్
HYD సిటీ ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ 24 అవర్స్ టికెట్ అప్డేట్ అయింది. QR కోడ్, ఫోన్ నంబర్‌తో పాటు టికెట్ ప్రింట్ వస్తుంది. ఇంతకుముందు QR కోడ్ లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు చెల్లని డే పాస్‌లతో ప్రయాణం చేస్తున్నా.. కొన్నిసార్లు కండక్టర్లు గుర్తించడం కష్టంగా ఉండేది. ఫోన్ నంబర్, QR కోడ్ ఉండడంతో నకిలీ టికెట్లు గుర్తించడం తేలిక అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
News February 2, 2025
రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత
రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. చుక్కాపూర్లో 11.9℃, చందనవల్లి, రెడ్డిపల్లె 12, ఎలిమినేడు 12.9, రాచలూరు, మీర్ఖాన్పేట 13, మంగళపల్లె 13.2, వైట్‌గోల్డ్ SS 13.3, రాజేంద్రనగర్ 13.4, దండుమైలారం, విమానాశ్రయం, అమీర్‌పేట, మద్గుల్ 13.5, తొమ్మిదిరేకుల 13.7, సంగం, కాసులాబాద్, హైదరాబాద్ యూనివర్సిటీ, వెల్జాల 13.8, కేతిరెడ్డిపల్లి 14, తాళ్లపల్లి 14.1, కొత్తూరులో 14.3℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.