News February 2, 2025

కాంగ్రెస్‌లోని రెడ్లకే టికెట్లు ఇస్తే బీసీ కులగణన ఎందుకు?: జాజుల

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.

Similar News

News February 2, 2025

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి మృతదేహం

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో ప్రయాణికులు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వ్యక్తి ఫొటోస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 2, 2025

ఇందల్వాయి: కంటైనర్ మీద నుంచి వెళ్లడంతో ఒకరు మృతి

image

ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో కంటైనర్ మీద నుంచి వెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన బత్తుల నాగరాజు (32) ఆదివారం తన బైక్ పై కామారెడ్డి వైపు నుంచి నిజామాబాద్ వెళ్తుండగా చంద్రాయన్పల్లి వద్ద సర్వీస్ రోడ్డు పనులు జరుగుతుండంతో రోడ్డు పక్కన అడ్డంగా పెట్టిన మట్టి బ్యాగులు ఢీకొని నాగరాజు కింద పడ్డాడు. ఆయనపై నుంచి కంటైనర్ వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

News February 2, 2025

బాపట్ల: రేపటి కార్యక్రమం రద్దు

image

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.