News December 28, 2025

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. రేవంత్ విషెస్

image

TG: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ‘భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి. జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 30, 2025

కర్నూలు: రబీకి సరిపడా యూరియా సిద్ధం

image

కర్నూలు జిల్లాలో రబీకి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జేడీఏ పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రణాళిక కంటే ఎక్కువ సరఫరా జరిగిందన్నారు. ప్రస్తుతం గోదాములు, రైతు సేవా కేంద్రాల్లో 5,849 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.

News December 30, 2025

BJP యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా భరత్ రెడ్డి

image

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా చింతలపల్లి భరత్ రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్. వంశీధర్ రెడ్డి సోమవారం నియమించారు. భరత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డి‌కు, పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

News December 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.