News March 29, 2024

కాంగ్రెస్ కరీంనగర్ టికెట్ ఎవరికి?

image

కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నెల 31న నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు పేర్లు వినిపించగా.. కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు తెరమీదకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ KNR, సిరిసిల్ల, సిద్దిపేట, HNK డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది. బరిలో నిలిచేదెవరో కామెంట్?

Similar News

News October 4, 2024

పెద్దపల్లి: టెన్త్ విద్యార్థి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కంటే చిన్నా(15) అనే పదో తరగతి విద్యార్థి వైరల్ ఫీవర్‌తో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే గత పదిరోజులుగా చిన్నా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో రెండు కిడ్నీల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News October 4, 2024

కరీంనగర్: నేడు ముద్దపప్పు బతుకమ్మ

image

కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి పూజలు చేస్తారు. ప్రధానంగా ముద్దపప్పును నివేదిస్తారు కాబట్టి ‘ముద్దపప్పు బతుకమ్మ’గా పిలుస్తారు. మూడోరోజు వాయినంగా ముద్దపప్పు, సత్తుపిండి, పెసర్లు, బెల్లం కలిపి పెడతారు.

News October 4, 2024

దుర్గామాతను దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి

image

రామగుండం మున్సిపల్ పరిధిలోని 42వ డివిజన్, 50వ డివిజన్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుర్గామాతను మొదటి రోజు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వారిని ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానం చేశారు.