News February 16, 2026
కాంగ్రెస్ ఖాతాలోకి 82 ఛైర్మన్, 5 మేయర్ పోస్టులు

TG: మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఛైర్మన్/మేయర్, వైస్ ఛైర్మన్/ డిప్యూటీ మేయర్ ఎన్నికల ఫలితాలను SEC అధికారికంగా ప్రకటించింది. INC 82 ఛైర్మన్, 5 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. BRS 18 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు సాధించింది. BJP, AIFBలకు చెరొకటి, ఇండిపెండెంట్లకు 3 ఛైర్మన్ స్థానాలు దక్కాయి. కార్పొరేషన్లలో కొత్తగూడెం CPI, కరీంనగర్ BJP ఖాతాలో చేరాయి. 11 చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది.
Similar News
News February 19, 2026
తిన్న వెంటనే వాటర్ తాగొచ్చా?

భోజనం అయిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలా చేస్తే ఎంజైమ్‌లు, జీర్ణరసాలు పలుచబడి డైజెషన్ మందగిస్తుంది. ఫలితంగా బాడీ పోషకాలను సరిగా గ్రహించుకోలేదు. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం తినడానికి 10 నిమిషాల ముందు లేదా తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం బెటర్. అవసరమైతే భోజనం మధ్యలో చిన్న సిప్స్ తాగొచ్చు.
News February 19, 2026
పడమర, దక్షిణ దిశల్లో నీటి ప్రవాహాలు ఉంటే?

ఇంటికి పడమర, దక్షిణ దిశల్లో నీటి ప్రవాహాలు, లోయలు, గుంతలు, చెరువులు ఉండటం మంచిది కాదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. దీనివల్ల ఇంటికి, ఇంట్లోవారికి భవిష్యత్తులో భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ‘మురికి కాలువలు ఇళ్లకు ఏదిక్కున ఉన్నా ఆరోగ్య సమస్యలుంటాయి. నీటి ప్రవాహాలు ఇళ్లకు తూర్పు, ఉత్తర దిశల్లో ఉండాలి’ అంటున్నారు. అన్ని వాస్తు నియమాలకు శాస్త్రీయ జవాబులుండవని స్పష్టం చేస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 19, 2026
లోకేశ్ కౌంటర్.. ‘పుష్ప’ స్టైల్లోనే YCP MLA విమర్శలు

AP: ‘X’లో TDP-YCP మధ్య ‘పుష్ప’ స్టైల్ మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ ఖర్చులతో శ్రీలంకలో <<19173502>>మ్యాచ్<<>> చూశారన్న ఆరోపణలపై మంత్రి లోకేశ్ పుష్ప శైలిలో కౌంటర్ ఇచ్చారు. దీనిపై YCP MLA చంద్రశేఖర్ అదే శైలిలో స్పందిస్తూ.. ‘ఆ దుడ్లు చూసుకునే కదా ఇంతలా పులిపిక్కిపోతాండావు? ఇందాపూర్- హెరిటేజ్‌ల డైరీ మధ్య లింక్ ఏంటి? సిండికేట్ నడిపే వారికి సొంతం అంటూ ఏం ఉండదు.. కమీషన్‌పైనే నడుస్తుంది’ అని విమర్శించారు.


