News January 12, 2025
కాంగ్రెస్ డీఎన్ఏలో ద్వేషం, విధ్వంసం: ఎమ్మెల్సీ కవిత
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ దాడిని ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉందని మరోసారి రుజువైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారని అన్నారు.
Similar News
News January 12, 2025
HYD: హైడ్రాకు ప్రజావాణిలో 83 ఫిర్యాదులు
చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, పుట్‌పాత్‌లను పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా దూకుడు పెంచింది. ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జా, లేఅవుట్లు, ప్లాట్ల తగాదాలు, రోడ్డు ఆక్రమణల వంటి 10వేల ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 83ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
News January 12, 2025
హైదరాబాద్‌లో కిక్కిరిసిన వాహనాలు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని రోడ్లు ప్రయాణికుల రద్దీ నెలకొంది. తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు, ఏపీకి వెళ్లే వారితో కూకట్‌పల్లి, MGBS, JBS, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్లు రద్దీగా మారాయి. LB నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
News January 11, 2025
HYD: పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్
ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్.. 21 దేశాల నుంచి వస్తున్నారు. వీరంతా తమ తమ దేశాలకు సంబంధించిన గాలి పటాన్ని ఎగరవేయనున్నారు.