News February 27, 2026

కాంగ్రెస్ నిరసనలకే పరిమితమైంది: పీఎం మోదీ

image

1984 నుంచి కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ వస్తోందని.. ఇప్పుడు నిరసనలకే పరిమితమైందన్నారు పీఎం మోదీ. ఆర్టికల్ 370 రద్దు, CAA, ట్రిపుల్ తలాక్ రద్దు, UPI, స్వచ్ఛభారత్, కరోనా వ్యాక్సిన్.. ఇలా సంస్కరణలు అన్నింటినీ వ్యతిరేకించిందన్నారు. ప్రతిపక్షం అంటే విమర్శలే కాదని, ప్రత్యామ్నాయ విజన్ చూపాలని హితవు పలికారు. కాంగ్రెస్‌కు మిలీనియల్స్ బుద్ధి చెప్పారని.. ఇప్పుడు జెన్‌జీలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Similar News

News February 28, 2026

కీరదోసలో బూడిద తెగులును ఎలా నివారించాలి?

image

కీరదోసలో బూడిద తెగులు ఆశిస్తే ఆకుల ఉపరితలంపై, కాడలపై తెల్లటి బూడిద వంటి పొడి ఏర్పడుతుంది. ఉద్ధృతి ఎక్కువైతే కాండం, పూతపై కూడా ఈ పొడి కనిపిస్తుంది. ఇది ఆకు మొత్తం కప్పేసి చివరికి ఆకులు పసుపు రంగులోకి మారి కాండంతో సహా ఎండిపోతాయి. దీనివల్ల మొక్కలు బలహీనపడతాయి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి థయోఫనేట్‌ మిథైల్‌ (75% WG) 2.5 గ్రా. లేదా బినామిల్‌ 50% WP 0.4 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

News February 28, 2026

‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

image

<<19244440>>వివాదాస్పదమైన<<>> ‘ది కేరళ స్టోరీ-2’ మూవీకి ఆదరణ కరవైంది. రూ.30Crతో తీసిన ఈ చిత్రం తొలిరోజు నిన్న రూ.3.5Cr వసూలు చేసింది. కేరళలో అయితే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బుక్ మై షో ప్రకారం తిరువనంతపురంలోని PVRలో 4 షోలకు 68 టికెట్లే బుక్ అయ్యాయి. తొలి నుంచి ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న DYFI కార్యకర్తలు థియేటర్ల ముందు నిరసనలకు దిగారు. కాగా 2023లో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ మాత్రం బ్లాక్‌బస్టర్ అయింది.

News February 28, 2026

పెదవులు నల్లగా మారాయా?

image

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, డ్రగ్స్, స్మోకింగ్ వల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్​ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.