News December 21, 2025

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు సిరిసిల్లలో నిరసన

image

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 21వ తేదీ ఆదివారం సిరిసిల్లలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసన తెలియజేస్తామని, జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు.

Similar News

News December 28, 2025

నా ప్రాణానికి ముప్పు: MLC దువ్వాడ

image

AP: తన ప్రాణానికి <<18684111>>ముప్పు<<>> ఉందని MLC దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తనకు ఏమైనా జరిగితే దానికి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదే కారణమని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం SPని కలిసి ఫిర్యాదు చేశారు. 2+2 గన్‌మెన్‌లను కేటాయించాలని కోరారు. కొద్ది రోజులుగా తనకు ఫోన్‌లో, ప్రత్యక్షంగా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారిని అణచివేయాలనే ధోరణి సరికాదని మీడియాతో అన్నారు.

News December 28, 2025

గద్వాల: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అర్హులైన విద్యార్థులు వచ్చే ఏడాది జనవరి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో గురుకుల అధికారులు పాల్గొన్నారు.

News December 28, 2025

సహకారం అందిస్తాం.. అభివృద్ధి చేయండి : ఆది శ్రీనివాస్

image

పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లను ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని సర్పంచులను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో సన్మానించి అభినందించారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వం తరఫున గ్రామ సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.