News January 4, 2026
కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఆమంచి కృష్ణ మోహన్

కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఆమంచి కృష్ణ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ న్యూఢిల్లీలో 41 మందితో కూడిన నూతన అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. బాపట్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడం లక్ష్యంగా అమాంచికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు నాయకులు చర్చించుకుంటున్నారు.
Similar News
News February 12, 2026
మున్సిపల్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: వనపర్తి కలెక్టర్

వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఆయా కేంద్రాల్లో లెక్కింపు ప్రారంభం కానుందని పేర్కొన్నారు. మూడంచెల పోలీస్ భద్రత నడుమ ప్రశాంతంగా ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించి కౌంటింగ్‌ను విజయవంతం చేయాలని కోరారు.
News February 12, 2026
మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్ తేజస్

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం సిద్ధమైందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు శిక్షణ ఇచ్చారు. సీసీ కెమెరాల నిఘాలో పారదర్శకంగా కౌంటింగ్ జరుగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏజెంట్ల సమక్షంలోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
News February 12, 2026
గురుకులాల్లో ప్రవేశాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గురుకుల విద్యాలయాలలో 2026- 27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుండి జూనియర్ ఇంటర్ వరకు నూతన ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి తూ.గో జిల్లా సమన్వయ అధికారి రాజకుమారి సూచించారు. 6 నుండి 10 తరగతిల వరకు ఉన్న ఖాళీలకు బాలురు బాలికల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. https://apgpcet.apcffss.in ఆన్లైన్లో ఈనెల 19 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు


