News December 9, 2025
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే: కిషన్ రెడ్డి

తెలంగాణలో గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి సాధించిందని ‘ప్రజాపాలన విజయోత్సవాలు’ జరుపుకుంటున్నారో సీఎం రేవంత్ ప్రజలకు వివరణ ఇవ్వాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్లలో చేసిందంతా కాంగ్రెస్ ప్రభుత్వం రిపీట్ చేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు, అవినీతిలో కాంగ్రెస్ ముందుందని ఆయన ఎద్దేవా చేశారు.
Similar News
News December 11, 2025
MHBD: నాన్నపై ప్రేమతో!

MHBD(D) కొత్తగూడ(M) వెలుబెల్లికి చెందిన రాజు తన తండ్రిపై ఉన్న ప్రేమను అద్భుతంగా చాటుకున్నాడు. కొన్ని నెలల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, బాధను దిగమింగుకుని వినూత్నంగా నివాళులర్పించాడు. తమ పొలంలో నారుమడి వేస్తూ ఏకంగా తన తండ్రి ఎల్లయ్య పేరునే నారుతో తీర్చిదిద్దాడు. ఈ భావోద్వేగ ఘట్టం ఇప్పుడు ఆ ప్రాంతంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తండ్రిపై కొడుకు చూపిన ఈ ప్రేమాభిమానం పలువురిని కదిలిస్తోంది.
News December 11, 2025
నేడే రెండో T20.. మ్యాజిక్ కొనసాగిస్తారా?

IND-SA మధ్య 5 T20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ ముల్లాన్‌పూర్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. తొలి T20లో IND 101 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బౌలింగ్‌లో మెప్పించిన భారత్ బ్యాటింగ్‌లో కాస్త కంగారు పెట్టింది. హార్దిక్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. అందుకే బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
News December 11, 2025
సంగారెడ్డి: ఎన్నికలకు బందోబస్తు ఎంత మందో తెలుసా?

జిల్లాలోని ఏడు మండలాల్లో 129 పంచాయతీల్లో జరిగే ఎన్నికలకు పోలీస్ శాఖ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. 7 మంది సీఐలు, 28 మంది ఎస్సైలు, 16 మంది పోలీసు అధికారులు, 1,120 మంది కానిస్టేబుళ్లను బందోబస్తుకు సిద్దం చేసింది. వారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తారు.


