News November 19, 2025

కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

image

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

పెద్దకొత్తపల్లి: కీచక ఉపాధ్యాయుడి సస్పెండ్

image

పెద్దకొత్తపల్లి మండలంలోని గంట్రావుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడు జైన్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉపాధ్యాయుడి ప్రవర్తన తీరుకు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ధి చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో విచారణ చేసి సస్పెండ్ చేశారు.

News November 19, 2025

సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు గిల్ దూరం!

image

SAతో తొలి టెస్టులో మెడనొప్పికి గురైన IND కెప్టెన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తొలి టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యంతో ఘోర ఓటమి మూటగట్టుకున్న భారత్‌కు గిల్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బని చెప్పవచ్చు. అతడి ప్లేస్‌లో BCCI సాయి సుదర్శన్‌ను తీసుకుంది. పంత్‌‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ ప్రారంభం అవుతుంది.

News November 19, 2025

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు

image

TG: చలి, పొగమంచు పెరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో HYD ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచనలు చేశారు. ‘నెమ్మదిగా నడుపుతూ అలర్ట్‌గా ఉండండి. మంచులో హైబీమ్ కాకుండా లోబీమ్ లైటింగ్ వాడండి. ఎదుటి వాహనాలకు సురక్షిత దూరాన్ని మెయిన్‌టైన్ చేయండి. సడెన్‌ బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అవుతుంది. మొబైల్ వాడకుండా ఫోకస్డ్‌గా ఉండండి. వాహనం పూర్తి కండిషన్‌లోనే ఉందా అని చెక్ చేసుకోండి’ అని సూచించారు.