News February 14, 2026

కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసింది: KTR

image

TG: లోకల్ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావం బాగా పెరిగిందని BRS నేత KTR పేర్కొన్నారు. కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ఆశించిన సీట్లు రాలేదని INCలో అసంతృప్తి ఉంది. BJPకి ఓట్లు, వార్డులు తక్కువ వచ్చినా అంతా బాగున్నట్లు చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదు. మా పార్టీ గట్టిగా పోరాడింది. ఇప్పుడున్న 17 మున్సిపాల్టీలతో పాటు హంగ్ స్థానాల్లోనూ ఎక్కువ గెలుచుకుంటాం’ అని మీడియాతో చెప్పారు.

Similar News

News February 14, 2026

అకౌంట్‌లో ఉన్న డబ్బుతో వడ్డీ పొందొచ్చు!

image

రిస్క్ లేకుండా అకౌంట్‌లో ఉన్న డబ్బుతో వడ్డీ పొందవచ్చు. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ (MODS) ద్వారా సేవింగ్స్ అకౌంట్‌లో నిర్ణీత పరిమితి దాటిన డబ్బు ఆటోమేటిక్‌గా FDగా మారుతుంది. అవసరమైనప్పుడు ఆ డబ్బును ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంపై వడ్డీ కొనసాగుతుంది. తక్కువ రిస్క్‌తో ఎక్కువ వడ్డీ వస్తుంది. చాలా బ్యాంకుల్లోనూ ఈ సౌకర్యం ఉన్నప్పటికీ లిమిట్‌లో తేడాలున్నాయి. SHARE IT

News February 14, 2026

చేతులు మెరిసేలా..

image

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.

News February 14, 2026

స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ విజయం

image

T20WC: కోల్‌కతా వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటిష్ జట్టు తొలుత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 86కే 4 వికెట్లు పడిన సమయంలో స్కాట్లాండ్ పైచేయి సాధించినట్లే కన్పించింది. ఆపై ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా బౌండరీలు బాదుతూ విజయం వైపు నడిచారు. 18.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించారు. బ్యాంటన్ 41 బంతుల్లోనే 63 పరుగులతో రాణించారు.