News November 4, 2025
కాంగ్రెస్ సలహా మండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా వీరయ్య

భద్రాచలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొదెం వీరయ్యకు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సలహా మండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించింది. కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన విధేయతతో ప్రజాసేవ పట్ల అంకిత భావంతో ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించడంతో ఈ బాధ్యతలు అప్పగించారు.
Similar News
News November 4, 2025
వరి కోతలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది

వరి వెన్నులో 80-90% గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు పంటను కోయాలి. ఈ దశలో గింజల్లో తేమ 18-24% వరకు ఉంటుంది. గింజలు పూర్తిగా ఎండే వరకు ఉంచకూడదు. పంట పక్వానికి వచ్చాక ఎక్కువ కాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గి, గింజలపై పగుళ్లు ఏర్పడి ధాన్యాన్ని మర పట్టించినప్పుడు నూక శాతం పెరుగుతుంది. గింజలలో తేమ శాతం తగ్గించడానికి పనలను 4 నుంచి 5 రోజులు చేనుపై ఎండనివ్వాలి. పనలను తిరగతిప్పితే సమానంగా ఎండుతాయి.
News November 4, 2025
వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,920 పలకగా.. నేడు రూ. 30 పెరిగి, రూ.6,950 అయినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. మార్కెట్‌కు సుమారు 12 వేల పత్తి బస్తాలు వచ్చినట్లు చెప్పారు. కాగా వర్షం కారణంతో మార్కెట్లో కొనుగోళ్లకు అంతరాయం కలిగింది.
News November 4, 2025
ఫ్లాప్స్ వచ్చినా ఆఫర్లకు కొదవలేదు..

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా హీరోయిన్ శ్రీలీల హవా కొనసాగుతోంది. పెళ్లి సందడితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ధమాకా, భగవంత్ కేసరి వంటి హిట్లు ఖాతాలో వేసుకున్నారు. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, మాస్ జాతర అలరించలేకపోయాయి. 10కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి సక్సెస్ రేట్ 30శాతమే ఉంది. ప్రస్తుతం శ్రీలీల 3-4 సినిమాల్లో నటిస్తున్నారు.


