News October 8, 2025

కాంగ్రెస్ హామీలు ఎన్నికల డ్రామానే: శ్రీనివాస్ గౌడ్

image

కామారెడ్డిలో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, హడావుడిగా రిజర్వేషన్లు ప్రకటించడం కేవలం ఎన్నికల డ్రామా తప్ప మరొకటి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. 22 నెలలుగా మాట్లాడకుండా ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. బీహార్, మహారాష్ట్ర ఎన్నికల కోసమే ఈ చర్యలని ఎద్దేవా చేశారు.

Similar News

News October 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 09, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.11 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 9, 2025

VKB: రేషన్ బియ్యాన్ని సకాలంలో సీఎంఎస్‌కు అందించాలి: అ. కలెక్టర్

image

రైస్ మిల్లర్లు రేషన్ బియ్యాన్ని సకాలంలో సీఎంఎస్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)కు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా రైస్ మిల్లర్లు బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. సకాలంలో బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదనపు కలెక్టర్ సూచించారు.

News October 9, 2025

టపాసుల గోదాములపై తనిఖీలు చేపట్టండి: కలెక్టర్

image

రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం లైసెన్సు పొందినవారే బాణసంచా తయారీ, నిల్వలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.