News October 12, 2025
కాంగ్రేస్ జిల్లా అధ్యక్ష బరిలో 8 మంది దరఖాస్తులు

జయశంకర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన జిల్లాకు చెందిన నాయకులు అధ్యక్ష పదవిని ఆశిస్తూ తమ బయోడేటాను రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ ఛైర్మన్, జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాశ్ రెడ్డికి దరఖాస్తులను అందజేశారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న పేర్లను త్వరలో అధిష్ఠానానికి పంపి ఎంపిక చేయనున్నారు.
Similar News
News October 12, 2025
సెమీఫైనల్ చేరుకున్న చిత్తూరు జిల్లా టీం

రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో సెమీఫైనల్‌కు చిత్తూరు జిల్లా టీం చేరుకుంది. కడప YSR స్టేడియంలో ఈ పోటీలు జరిగాయి. సెమీ ఫైనల్‌లో అర్హత కోసం తిరుపతి, చిత్తూరు జిల్లా జట్లు తలపడ్డాయి. ఆరు వికెట్ల తేడాతో చిత్తూరు జిల్లా జట్టు గెలుపొందింది. విజేత జట్టుకు గోపీనాథ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ నెల 19న అనంతపురంలో జోన్ ఫోర్ సెమీఫైనల్స్ జరుగునున్నాయి.
News October 12, 2025
25న పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

తిరుమలలో ఈనెల 25న నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7-9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.
News October 12, 2025
జగిత్యాల: విద్యా, వైద్యం ప్రభుత్వ బాధ్యత: ఎమ్మెల్సీ

జగిత్యాల పట్టణంలోని మిలాత్ ఇస్లామియా కమిటీ సభ్యులు ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యా, వైద్యం రెండూ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ, సామాజిక సేవలు కూడా అవసరమన్నారు. ప్రభుత్వపరంగా పొందలేని సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.