News October 7, 2025

కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ విరమణ ఐదేళ్లు పెంపు

image

కేయూలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నవారి ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు పెంచుతూ ఆమోదించింది. రెగ్యులర్ ఆచార్యులకు మాదిరిగానే వీరికి ఉద్యోగ విరమణ ఉండనుంది. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఆమోదించింది.

Similar News

News October 7, 2025

ఎనుమాముల మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు పెరిగాయి. సోమవారం తేజా మిర్చి(ఏసీ) క్వింటాకు రూ.14,350 ధర పలకగా.. ఈరోజు రూ.14,550కి చేరింది. 341 రకం మిర్చి(ఏసీ)కి నిన్న రూ.14,500 ధర వస్తే.. నేడు రూ.15,300 అయింది. మరోవైపు, వండర్ హాట్(WH) ఏసీ మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా.. నేడు రూ.16వేలు అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

News October 7, 2025

కుబీర్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుబీర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్‌కు చెందిన ముచ్చిండ్ల గణేష్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటీన భైంసా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించగా చికిత్స పొందుతూ గణేష్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 7, 2025

వరంగల్: నిర్దేశించిన సమయంలో షాపుల మూసివేత

image

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాలు, చోరీల నియంత్రణకై వరంగల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలో నిర్దేశించిన సమయంలోనే దుకాణాలను మూయించేందుకు పోలీస్ అధికారులు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. సీపీ ఆదేశాలతో దుకాణాలను సమయానికి మూయించేస్తున్నారు.