News October 8, 2025

కాకతీయుల ఆనవాళ్లకు చిహ్నం.. ఏకశిలా నగరం!

image

కాకతీయుల ఆనవాళ్లకు చిహ్నం ఓరుగల్లు. వారు నిర్మించిన చెరువులు, దేవాలయాలు కోకొల్లలు. వాటిలో ఒకటే ఏకశిలా నగరం. రాతి బండతో ఏర్పడిన ఈ ఏకశిలపై కోట నిర్మించడంతో ఈ పేరు వచ్చింది. దీన్ని రాజధాని రక్షణకు వ్యూహాత్మక స్థలంగా కాకతీయులు ఉపయోగించారు. పైనుంచి చుట్టుపక్క ప్రాంతాలన్నీ కనిపించేలా ఉండటంతో నిఘా కేంద్రంగా పనిచేసింది. గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కాలంలో ఈ కొండ రాజభవనంలా విరాజిల్లింది.

Similar News

News October 8, 2025

హుజూరాబాద్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం

image

హుజూరాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గ్రామ శివారులోని కాకతీయ కాలువలో బుధవారం ఉదయం గుర్తుతెలియని మృత దేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని, రెండు రోజుల క్రితం కాలువలో పడి ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. శవం ఉబ్బిపోవడంతో గుర్తింపు కష్టతరమైందని పోలీసులు తెలిపారు. మరణానికి గల కారణం, వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 8, 2025

పిల్లల ఫొటోలు తీస్తున్నారా? ఇలా చేయండి!

image

చాలామంది తమ పిల్లల బాల్యాన్ని, మధుర జ్ఞాపకాలను కెమెరాతో బంధించి కొద్దిరోజుల్లోనే డిలీట్ చేయడం చూస్తుంటాం. ఇంతదానికి ఫొటోలు తీయడం ఎందుకు? అలా చేయకుండా వారి పేరిట ఓ మెయిల్ క్రియేట్ చేసి అందులో స్టోర్ చేయొచ్చని పలువురు సూచిస్తున్నారు. వారి ఫొటోలు, వీడియోలను mailలో స్టోర్ చేసి యుక్త వయసు వచ్చాక వారికిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదూ. మరి ఆలస్యమెందుకు.. ఇప్పుడే మెయిల్ క్రియేట్ చేసేయండి. SHARE IT

News October 8, 2025

భద్రాద్రి: మండలాలకు చేరిన బ్యాలెట్ బాక్సులు

image

స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి జిల్లా కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాలకు తరలించారు. బుధవారం రోజున జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ గోడౌన్ నుంచి ఈ బాక్సులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.