News March 30, 2024
కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాలకు సంరక్షణ కరువు

ఖిలావరంగల్‌లో కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాల సంరక్షణను కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గాలి కొదిలేశారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. పడమరకోట చమన్ కూడలిలోని నివాస గృహాల నడుమ ఉన్న కట్టడంపై ఏపుగా ముళ్ల పొదలు పెరిగాయి. ఫలితంగా రాళ్లు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితిలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చెట్లు తొలగించి పురాతన కట్టడాన్ని భావితరాలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Similar News
News September 8, 2025
వరంగల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర నుంచి యధావిధిగా కార్మికులకే ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవికి CITU రాష్ట్ర కార్యదర్శి మాధవి ఈరోజు వినతి పత్రం అందజేశారు. మాధవి మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, కార్మికులకు పని భద్రతను కల్పించాలని కోరారు.
News September 8, 2025
వరంగల్: ‘గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులకు నష్టపరిహారం అందజేయాలి’

గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులకు నష్టపరిహారం అందజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌లో బాధిత రైతులతో కలెక్టర్ సత్య శారదను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితుల రైతులందరూ కూడా చిన్న కారు రైతులని, ఈ భూమి పైనే వారి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.
News September 7, 2025
వరంగల్ జిల్లాలో వర్షపాతం ఇలా..!

వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. ఖిలా వరంగల్ ప్రాంతంలో 56 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. గీసుకొండలో 38, దుగ్గొండి, సంగెం, నల్లబెల్లిలో 20 మి.మీ వర్షపాతం రికార్డయింది. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో వర్షం కురువలేదని, చెన్నారావుపేట, నర్సంపేట, పర్వతగిరిలో ఓ మోస్తరుగా వాన పడింది.