News February 21, 2025
కాకతీయ రాజు పెళ్లి ఉత్సవాలు.. హాజరైన ఓరుగల్లు బీజేపీ నేతలు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రుద్రమదేవి వారసుడు రాజా కమల్ చంద్ర బాంజ్ దేవ్ మహారాజ్ వివాహ వేడుకలు జగదల్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ రాజవంశ యువరాణితో గురువారం పెళ్లి జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రముఖులు హాజరయ్యారు. ఓరుగల్లు నుంచి బీజేపీ నేతలు నాంపల్లి శ్రీనివాస్, పూసల శ్రీమాన్, శ్రీనివాస్, శ్రీహరితో పాటు మరికొందరు హాజరయ్యారు.
Similar News
News February 24, 2026
కీరదోసలో పండు ఈగ – నివారణ

కీరదోసను ఆశించే పండు ఈగలు పువ్వు మొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన సన్నని పిల్ల పురుగులు కాయను తొలచి, లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. దీని వల్ల కాయలు కుళ్లిపోయి దిగుబడి తగ్గిపోతుంది. వీటి నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2ml (లేదా) ప్రొఫెనోఫాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగులను నివారించడానికి విషపు ఎరలను తయారు చేసుకోవాలి.
News February 24, 2026
శ్రీకృష్ణుడి విశ్వరూపం చూసిన ‘ఉదంకుడు’

గౌతమ మహర్షి శిష్యుడైన ఉదంకుడు ఎడారిలో నివసించేవాడు. కురుక్షేత్రం వల్ల జరిగిన భారీ ప్రాణనష్టానికి ఆగ్రహించి, యుద్ధాన్ని ఆపనందుకు కృష్ణుడిని శపించబోయాడు. అప్పుడు కృష్ణుడు అతనికి తన విశ్వరూపాన్ని చూపి, సృష్టి ధర్మాన్ని వివరించి శాంతింపజేశాడు. సంతుష్టుడైన ఉదంకుడికి ఎప్పుడు దాహం వేసినా తలచుకోగానే నీరు లభిస్తుందని వరం ఇచ్చాడు. కృష్ణుడు మేఘాల రూపంలో ఆయనకు పంపిన నీటిని ‘ఉదంక మేఘాలు’ అని పిలుస్తారు.
News February 24, 2026
ఒకే రోజు రెండు సార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్-రష్మిక!

విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం ఈనెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరగనుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. వీరు తెలుగు, కర్ణాటక (కొడువ) సంప్రదాయాల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోనున్నారు. ఉదయం తెలుగు పద్ధతిలో వివాహం, సాయంత్రం కొడువ సంప్రదాయంలో వేడుక జరగనుంది. అనంతరం మార్చి 3న HYDలోని తాజ్ కృష్ణలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.


