News August 7, 2025
కాకాణితో మాజీ మంత్రి ములాఖత్

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం ములాఖత్ అయ్యారు. అనంతరం డైకస్ రోడ్డు సెంటర్‌లో ఉన్న కాకాణి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుందని అయన ఆరోపించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయన వెంట వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నేదురుమల్లి ఉన్నారు.
Similar News
News August 9, 2025
నెల్లూరు: పలు దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్

నెల్లూరులో నామినేటెడ్ పదవుల సందడి మొదలు కాబోతోంది. ఆలయ పాలకమండలి ఛైర్మన్లకు, సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, వేదగిరి నరసింహస్వామి దేవస్థానం, మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంతో పాటు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆలయ కమిటీలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో చైర్మన్ పదవులను, బోర్డు మెంబర్స్ పదవులను దక్కించుకునేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు.
News August 8, 2025
నెల్లూరులో డిజైన్స్ బట్టి అదిరిపోయే రేట్లు

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమకు ప్రతీకగా భావించే రాఖీ పండగ సందడి నెల్లూరులో మొదలైంది. ఎటు చూసినా అందమైన డిజైన్ల రాఖీలే దర్శనమిస్తున్నాయి. అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు మహిళలు దుకాణాలకు క్యూ కట్టారు. దీంతో నెల్లూరులోని పలు దుకాణదారులు రాఖీల రేట్లు అమాంతం పెంచేశారు. రూ.30 నుంచి రూ.500 వరకు రాఖీల రేట్లు ఉన్నాయి. వెండి రాఖీలు సైతం మార్కెట్లో దర్శనమిస్తున్నాయి.
News August 8, 2025
మాజీ మంత్రి కాకాణికి బెయిల్ మంజూరు

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో బెయిల్ వచ్చింది. కనుపూరు చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్విన కేసులో అయన A1గా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు గురువారం బెయిల్ మంజూరు చేస్తూ నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసులో ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైలులో ఉన్నారు.