News April 5, 2025

కాకాణి కేసు.. నిన్న హైకోర్టులో జరిగిన వాదనలు ఇవే..!

image

కాకాణి బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగి 7కి వాయిదా పడిన విషయం తెలిసిందే. నేరాలు చేసినట్లు పిటిషనర్‌పై ఆరోపణలు లేవని, సాక్షుల వాంగ్మూలంతోనే కేసులు నమోదు చేశారని కాకాణి లాయర్ వాదించారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించి, ఆస్తులను నాశనం చేసినట్లు చెప్పలేదన్నారు. కాకాణిపై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్లు చెల్లుబాటు కావని, దీనిపై ముందస్తు బెయిల్ మంజూరు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుందని వినిపించారు.

Similar News

News February 26, 2026

అనంతసాగరం MROపై సస్పెన్షన్ వేటు

image

అనంతసాగరం MRO జయవర్ధన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని పట్ల ఆయన అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వేధిస్తున్నాడంటూ జిల్లా అధికారులకు బాధిత ఉద్యోగిని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు విచారణ చేసిన అధికారులు నిజం అని తేలడంతో MROపై వేటు వేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలు జారీ చేశారు.

News February 26, 2026

నెల్లూరులో కొత్త మోసం.. జాగ్రత్త!

image

ఆన్‌లైన్ దోపిడీకి సైబర్ నేరగాళ్లు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. RTO ఆఫీస్ చలానా పేరుతో వాట్సాప్‌కు APK ఫైల్స్ పంపిస్తున్నారు. నెల్లూరులో కొందరు వీటిని క్లిక్ చేశారు. వారి నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఏపీకే ఫైల్ ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ అవుతోంది. ఇలాంటి వాటిని క్లిక్ చేస్తే నగదు దోచేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News February 26, 2026

నెల్లూరు: ఒక్కరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

image

ఈ నెల పింఛన్లను ఒక్క రోజు ముందుగానే ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మార్చి నెల ఒకటో తేదీన ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28న పింఛన్ నగదును పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 289647 పింఛన్లకు సంబంధించి రూ.126.91 కోట్లను అందజేస్తున్నట్లు DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు.