News August 22, 2025

కాకాణి బెయిల్ షరతు సవరణ పిటిషన్‌పై నేడు విచారణ

image

తనకు బెయిల్ సందర్భంగా విధించిన షరతును సవరించాలని కోరుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాకాణిని ప్రతి ఆదివారం దర్యాప్తు అధికారి ముందు హాజరవ్వాలని, పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు రావడానికి వీల్లేదని హైకోర్టు షరతు విధించింది. ఈ షరతును సవరించాలని కోరగా.. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

Similar News

News November 6, 2025

రేపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రాక

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు నెల్లూరు VRC మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక లక్ష దీపోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు డీఆర్సీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4.15 గంటలకు కొండ బిట్రగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని మంత్రి దర్శించుకుంటారు.

News November 6, 2025

కలగానే..ఉదయగిరి రెవెన్యూ డివిజన్!

image

నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్దండులకు పేరుగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కలగా మారుతోంది. ఇక్కడున్న 8 మండలాల్లో నాలుగింటిని కావలిలో కలిపేలా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదన ఉండడంతో ఆ ప్రాంతవాసులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు గూడూరును నెల్లూరుజిల్లాలో కలిపేందుకు మంత్రి వర్గ ఉపసంఘం సానుకూలతను కల్పించడం కొంత మేరా ఆశాజనకంగా మారుతుంది. అయితే దీనిపై గెజిట్ వచ్చే వరకు వేచి చూడకు తప్పదు.

News November 6, 2025

లోకేష్ పర్యటనలో టోల్ గేట్ వరకే పరిమితమైన కావలి MLA !

image

మంత్రి నారా లోకేష్ కావలి నియోజకవర్గ పర్యటనలో MLA కృష్ణారెడ్డి పాత్ర కేవలం ముసునూరు టోల్ గేట్ వరకు మాత్రమే పరిమితమైంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ వెంట MLA దగదర్తికి వెళ్లలేదు. MLA కావ్యకు టీడీపీ నేత మాలేపాటికి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. కావ్య రాకను మాలేపాటి అనుచరులు, అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఆయన టోల్ గేట్ వరకే పరిమితమయ్యారని సమాచారం.