News December 15, 2025

కాకాణి రిట్ పిటిషన్‌పై హైకోర్టు స్పందన

image

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో తనపై నమోదు చేసిన కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖాలు చేశారు. గతంలో దీనిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎంకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. దీనిపై నోటీసులు జారీ చేసి.. ప్రతివాదుల స్పందన అనంతరం విచారణ చేపట్టి తగు నిర్ణయం తీసుకొనేందుకు హైకోర్ట్ 8 వారాలు వాయిదా వేసినట్లు కాకాణి ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News December 19, 2025

రేపు ఏపీ గౌరవ సలహాదారు నెల్లూరుకు రాక

image

ఈనెల 20 శనివారం ఏపీ గౌరవ సలహాదారు డా. జి.సతీష్ రెడ్డి మూడు రోజులు పాటు పర్యటనలో భాగంగా నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. శనివారం రాత్రికి నెల్లూరుకు చేరుకొని, ఆదివారం ఉదయం 10 గంటలకు దుత్తలూరులో నిర్వహించే స్కాలర్‌షిప్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మహిమలూరులో జరిగే కార్యక్రమాల్లో హాజరై తిరిగి నెల్లూరులో బస చేయనున్నట్లు తెలిపారు.

News December 19, 2025

సినిమా హాల్లో ప్రమాణాలు పాటించాలి: జేసీ

image

సినిమా హాల్లో నిర్వాహకులు ప్రమాణాలు పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని అన్ని సినిమా హాల్లో ప్రభుత్వం నిబంధన ప్రకారం నిర్వహించాలని సూచించారు. సినిమా హాల్లో ప్రేక్షకులకు మౌలిక వసతులు కల్పనతోపాటు తినుబండారలు ధరల విషయంలో కూడా నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు చూసుకోవాలన్నారు.

News December 19, 2025

నెల్లూరు: PM విశ్వకర్మ దరఖాస్తుల్లో కోత.!

image

చేతివృత్తుల వారి అభ్యున్నతికి కేంద్రం చేపట్టిన ‘పీఎం విశ్వకర్మ’ పథకం నెల్లూరు జిల్లాలో మందకొడిగా సాగుతోంది. రెండేళ్లలో 77,190 దరఖాస్తులు రాగా.. 12730 రిజిస్ట్రేషన్ జరిగాయి. నిబంధనలతో 64,560 తిరస్కరణకు గురయ్యాయి. కేవలం 12,730 మందే అర్హత సాధించగా.. వారిలోనూ 2,618 మందికే రుణాలు, 4,011 మందికి టూల్‌కిట్లు అందాయి. శిక్షణ పూర్తయినవారికీ సకాలంలో ఆర్థికసాయం అందకపోవడంపై వృత్తిదారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.