News October 9, 2025
కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హెలికాప్టర్‌లో కాకినాడ చేరుకుంటారు. కలెక్టరేట్‌లో మత్స్యకార సంఘాలు, కమిటీ ప్రతినిధులతో కాలుష్యం, నష్టపరిహారం చెల్లింపు అంశాలపై సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పాడ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు.
Similar News
News October 9, 2025
జగన్ పర్యటన వేళ పోలీసుల సూచనలు

AP: మాజీ సీఎం జగన్ ‘చలో నర్సీపట్నం’ పర్యటన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సూచనలు చేశారు. నిర్వాహకులు కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. హైవేలు, కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా జన సమీకరణ చేయకూడదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకైనా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనూ సామర్థ్యానికి మించి జనాలను సమీకరించకూడదని పేర్కొన్నారు.
News October 9, 2025
ఇకనైనా ANU ప్రతిష్ట మెరుగుపడుతుందా?

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పరిపాలనకు తెరపడింది. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ 24 స్థానాలు తగ్గడంతోపాటు, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై Way2Newsలో పలు కథనాలు ప్రరిచురించబడ్డాయ. ఈ పరిస్థితుల్లో నూతన వీసీ అకాడెమిక్ నాణ్యత, పేపర్ వాల్యుయేషన్, ఫలితాలలో పారదర్శకత, విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తే విశ్వవిద్యాలయ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు అవకాశముంది.
News October 9, 2025
NLG: స్లాట్ బుకింగ్‌తో.. ఇక ఆ సమస్యలకు చెక్

జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభం కానున్నాయి. రైతులు పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆయా తేదీల్లో ఖాళీలను బట్టి స్లాట్ బుకింగ్ చేసుకుని తమ దిగుబడులను మిల్లులకు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన అవసరం లేకపోవడంతో పాటు కేంద్రాల వద్ద ట్రాక్టర్లు, లారీల రద్దీ ఉండి రహదారులపై ట్రాఫిక్ జామ్ సమస్యకు కూడా చెక్ పడనుంది.