News October 30, 2024

కాకినాడలో తల్లీకుమార్తెలు మృతి.. UPDATE

image

కాకినాడలో తల్లీకుమార్తెలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తల్లి సరస్వతి కొంతకాలంగా మానసిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో తల్లిని చూసుకోవడం కోసం కుమార్తె స్వాతి పెళ్లి చేసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. తల్లి అనారోగ్యంతో ఉండటం చూసి మనస్తాపానికి గురైన స్వాతి 3రోజుల క్రితం ఉరేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News October 31, 2025

రాజమండ్రి ఎంపీపై కేసు నమోదు చేయాలి: జేటీ రామారావు

image

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌజ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.

News October 31, 2025

నవంబర్ 7న రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక

image

నవంబర్ 7న రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ సభ్యులంతా తప్పక హాజరు కావాలన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

News October 30, 2025