News July 17, 2024
కాకినాడలో రామేశంమెట్టను తవ్వేశారు

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశంపేట పరిధిలోని రామేశంమెట్ట వార్తల్లోకెక్కింది. గుట్ట ప్రాంతంలో ఎర్రమట్టి తవ్వకాలు భారీ ఎత్తున జరిగినట్లున్న చిత్రాలు వైరల్‌గా మారాయి. గుట్టపై ఉన్న విద్యుత్ స్తంభాల చుట్టూ కొంతమేర మట్టి వదిలి.. వాటి చుట్టూ దాదాపు 50 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. తాజాగా అధికారులు ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.
Similar News
News December 18, 2025
రాజమండ్రి: బాలికపై బాలుడి అత్యాచారం.. కేసు

మైనర్ బాలికపై రాందాసు పేటకు చెందిన పెద్దగింజపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. సెంట్రల్ జైలు వద్ద ఉన్న పార్కులో ఓ బాలుడు బాలికతో మాటలు కలిపి అక్కడి నుంచి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు పలు దొంగతనం కేసుల్లో నేరస్థుడుగా ఉన్నట్లు సమాచారం.
News December 18, 2025
తూ.గో: ముచ్చటగా మూడు పదవులు

తబ.గో జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి ముచ్చటగా 3 పదవులు వరించాయి. రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, రుడా ఛైర్మన్‌గా ఉన్న ఆయనకు ఇప్పుడు కొత్తగా జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. 3 పదవుల ముచ్చట మూన్నాళ్లకే పరిమితం అవుతుందా ? కొనసాగిస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. రుడా ఛైర్మన్ పదవిని వేరొకరికి కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
News December 18, 2025
రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్‌గా డాక్టర్ యామిని ప్రియ

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.


