News August 21, 2024
కాకినాడలో వసతి గృహాల ఆకస్మిక తనిఖీ
కాకినాడలోని పలు వసతి గృహాలను నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ఐసీడీఎస్ పీడీ ప్రవీణ మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్ వెనకనున్న వసతి గృహం, సీబీఎం కాలేజ్ రోడ్డులోని కల్వరి టెంపుల్ వద్ద గల వసతి గృహం, భాస్కర్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని పరివర్తన వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇబ్బందులు లేకుండా చూడాలని వసతి గృహాల నిర్వాహకులకు సూచించారు.
Similar News
News November 25, 2024
రేపు యథావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం: కలెక్టర్ ప్రశాంతి
సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండలస్థాయిలో అధికారులు తీసుకుని త్వరతగతిన పరిష్కారిస్తారని ఆమె తెలిపారు.
News November 24, 2024
కోనసీమ వాసికి అవార్డు అందించిన సినీ నటి కీర్తి సురేశ్
ఉమ్మడి తూ.గో.జిల్లా పి.గన్నవరంలో రెండున్నర దశాబ్దాల నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీగా సభ్యులకు సేవలు అందిస్తున్నందుకు ధనవర్ష సొసైటీకి ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ అవార్డు అందించారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్లో శనివారం జరిగిన సమావేశంలో అవార్డు అందించారని సంగం ఛైర్మన్ కంకిపాటి ప్రసాద్ ఆదివారం తెలిపారు.
News November 24, 2024
గోకవరం: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి
బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన విషాదకర ఘటన గోకవరం ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మి గోకవరం ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌లో పని చేస్తున్నారు. ప్రసవం నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా ఉమ్మనీరు రక్తనాళాల్లోకి వెళ్లి గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నవమాసాలు మోసి ఆ తల్లి బిడ్డను చూడకుండానే మృతి చెందడం కలిచివేసింది.